ఎన్నికల ముందు కెనడా ప్రధాని ట్రూడోకు భారీ షాక్..

-

కెనాడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఊహించని విధంగా భారీ షాక్ తగిలింది. ఆ దేశ పార్లమెంట్ జరిగే ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఆయన ప్రభుత్వం మైనార్టీలో పడినట్లు తెలుస్తోంది. జగ్మీత్ నాయకత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ తన మద్దతును ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, సాధారణ ప్రజలను లిబరల్స్ పట్టించుకోవడం లేదని, వారికి దక్కాల్సిన ప్రయోజనాలను ట్రూడో ప్రభుత్వం కేవలం కార్పొరేట్లకు కట్టబెడుతుందని జగ్మీత్ ఆరోపిస్తున్నారు.

మరోసారి వారి ప్రభుత్వం కెనడాలో అధికారంలోకి రావాడానికి అనర్హులు.ఎన్నికలను ఉద్దేశించి భారీ యుద్ధం ముందుంది అని న్యూ డెమోక్రటిక్ పార్టీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. అయితే, ట్రూడో నేతృత్వంలోని కెనడా సర్కార్ భారత్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకున్నది. ఆ దేశంలో ఖలీస్తానీ వేర్పాటు వాద చర్యలు ఎదుగుతున్న వారిని కట్టడి చేయకపోవడం, భారత్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నా పట్టించుకోకపోవడం, ఖలీస్తాని తీవ్రవాది నిజ్జర్ హత్యకేసులో భారత్‌ను నిందించడం వంటివి చేయడంతో ఇరుదేశాల మధ్య దూరం పెరిగడానికి ప్రధాని ట్రూడోనే కారణంగా తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version