ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఆదివాసీ మహిళపై లైంగికదాడితో పాటు హత్యాయత్నం చేశారన్న నేపథ్యంలో పలువురు ఆదీవాసీ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైనూర్‌లో 144 సెక్షన్ విధించారు. అయితే, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల షాపులను ధ్వంసం చేయడంతో పాటు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఆందోళనల నేపథ్యంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. అల్లర్లను కట్టడి చేసే క్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయగా 144 సెక్షన్ కొనసాగుతోంది.మరోవైపు బాధితురాలని పరామర్శించిన సీతక్క న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.