సచివాలయ ఉద్యోగులకు సెలవులు రద్దు..ప్రతి సోమవారం డ్యూటీ చేయాల్సిందే !

-

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రతి సోమవారం సెలవు లు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సోమవారం ఆయా సచివాలయాల పరిధిలో గ్రీవెన్స్ నిర్వహిస్తారు. బాధితులు తమ తమ సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి సోమవారం సచివాలయానికి వస్తున్న నేపధ్యంలో… ఇకపై ఎవరికీ సెలవులు మంజూరు చేయకూడదని… ఉద్యోగులు తప్పనిసరిగా హెడ్క్వార్టర్స్ లోనే ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

AP-Village-Secretariat-AP-Village-Secretariat-

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం హాజరు పట్టికలో సంతకాలు చేసి వాటి స్కానింగ్ కాపీలను ఉదయం 11:00 లోగా ఉన్నతాధికారులకు పంపించాలని తాజాగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు సోమవారం సెలవు మంజూరు చేయకూడదని, వారు హెడ్ క్వార్టర్ లో విడిచిపెట్టి వెళ్ళకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త ఆదేశాలు ప్రతి ఒక్కరూ పాటించాలని..లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక దీని పై సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version