బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ధాన్యమే కొంటలేరు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారంఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదు. సీఎం అనే సోయిలేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. 15 నెలలు గడిచినా కేసీఆర్ మాట లేకుండా సభ సాగట్లేదు. సోనియా 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు మోసపోయారు తప్ప రేవంత్ రెడ్డి మూర్ఖత్వపు మాటలకు కాదు.కాళేశ్వరాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పినా ఎలాంటి స్పందన లేదు.

మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. పంట పొలాల వద్ద కన్నీరు పెడుతున్నరు. కడుపుమండిన రైతులు,మహిళలు ప్రభుత్వానికి, రేవంత్ కు శాపనార్ధాలు పెడుతుండ్రు.ప్రభుత్వం ఇస్తామన్న రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదు.. బీమా లేదు.. ప్రతిదీ మభ్యపెట్టి మోసం చేశారు.బోనస్ ఇవ్వాల్సి వస్తుందని అసలు ధాన్యమే కొనడం లేదు.ఉన్న ధాన్యం ఎంత అంటే ఎక్కడ సమాధానం లేదు.. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను అధికారులు ఎత్తడమే లేదు.వాన కాలంలో ఏ పంట ఎంత కొన్నారు.. దొడ్డు రకానికి బోనస్ ఇస్తామని మాటమార్చి సన్నధాన్యానికి బోనస్ అన్నారు.ఎంత ధాన్యం కొన్నారు ఎంత బోనస్ ఇచ్చారు అంటే సమాధానం లేదు.నిన్న హుజూర్నగర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని ప్రదర్శించిండు.

మళ్ళీ కేసీఆర్‌ను తిట్టడం తప్ప వేరే పని లేదు. గత ఏడాది కొన్న సన్న వడ్లు ఎన్ని.. ఇచ్చిన బోనస్ ఎంతో సమాధానం చెప్పాలి. నీళ్లు ఇవ్వమంటే రైతుల పొలాలు వేసుకోరు.. నీళ్ళు ఇస్తామని ఇవ్వకపోవడంతో వేలాది ఎకరాలు నష్టపోయారు.ఒక తడికి ఇస్తే వేలాది ఎకరాలు పెట్టుబడి అయినా వస్తుంది.. చివరి భూముల వరకు నీళ్లు ఇవ్వాలి.ధాన్యం కొనుగోళ్లపై వెంటనే ఒక ప్రకటన చేయాలి. కన్నెపల్లి పంప్ హౌస్ బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు.. అయినా నడిపించే సోయి ప్రభుత్వానికి లేదు.NDSA ఒక సాకుతో కాలేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు.చంద్రబాబు నిబంధనలు తుంగలో తొక్కి నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి సోయిలేదు.రైతులు మేలుకోవాలి.. కాళేశ్వరం కొనసాగింపుకు మరో ఉద్యమం చేయాలి’ అని జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news