బిగ్ బ్రేకింగ్ : LKG పాపపై లైంగిక దాడికి యత్నం.. నిందితుడిపై పోక్సో కేసు

-

మనిషి ముసుగులో కొందరు మృగాళ్లు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని వారిపై లైంగికవాంఛలు తీర్చుకోవాలని చూస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాలు, స్కూళ్లల్లోనూ, నిర్మానుష్య ప్రదేశాల్లోకి తీసుకెళ్లి మరీ వారి లైంగికదాడులకు పాల్పడుతున్నారు.అటువంటి వారికి ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు.

తాజాగా ఏపీలోని విశాఖపట్నం జిల్లా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై అదే స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్న టీచర్ రామచంద్రరావు లైంగికదాడికి యత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని వారు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news