మీ పాన్ కార్డు మిస్ అయ్యిందా..?, ఎంత వెతుకుతున్నా కనపడడం లేదా..? అయితే పోయిన పాన్ కార్డును తిరిగి ఇలా పొందండి. ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాల లోకి వెళితే.. పోయిన పాన్ కార్డుని పొందాలంటే ఇలా ఈజీగా పొందొచ్చు. అది కూడా క్షణాల్లోనే.
పైగా దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని కూడా లేదు. కేవలం ఇంట్లో వుండే పాన్ ని ఈజీగా తెచ్చుకోవచ్చు. దీని కోసం మొదట మీరు మీరు కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్ ని ఓపెన్ చెయ్యండి. ఆ తర్వాత ఇపాన్ కార్డను డౌన్ లోడ్ చేసుకోండి.
ఇప్పుడు అక్కడ ఇన్‌స్టంట్ ఇపాన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని పై క్లిక్ చేసి పాన్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ప్రోసీడ్ చెయ్యండి. ఇలా మీరు పాన్ ని పొందొచ్చు.
ఒకవేళ మీకు పాన్ నెంబర్ గుర్తులేక పోయినట్లయితే.. మరొక ఆప్షన్ కూడా వుంది. ఆధార్ కార్డు సాయం తో పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకో వచ్చు. పాన్ ఆధార్ లింక్ అయ్యి ఉంటేనే ఈ పధ్ధతి లో అవుతుంది. ఆ తర్వాత ఓకే చేయాలి. ఓటీపీ వస్తుంది.. దానిని ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేయాలి. ఇప్పుడు పాన్ కార్డు డౌన్లోడ్ అయి పోతుంది.