హైదరాబాద్ లో స్విఫ్ట్ కార్ బీభత్సం..కారుతో పాటూ మ‌హిళ‌ను క్రేన్ తో ఎత్తుకెళ్లిన‌ పోలీసులు.!

-

హైద‌రాబాద్ లో రోజు రోజు రోడ్డు ప్ర‌మాదాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నా కొంత మంది వాహ‌న‌దారుల్లో మార్పు రావ‌డం లేదు. మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాలు న‌డ‌ప‌డం, అతివేగం ఇత‌ర కార‌ణాల వ‌ల్ల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ చదర్ ఘాట్ లో స్విఫ్ట్ కార్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టి కొద్ది దూరం వెళ్లి డివైడర్ ను ఢీకొట్టింది.

accident

దాంతో కారులో ఉన్న మహిళ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇక ప్రమాదం జరిగిన త‌ర‌వాత‌ మహిళ కారులో నుండి దిగకుండా నానా హంగామా సృష్టించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ ఎంతకీ కారు దిగకపోవడంతో క్రేన్ సహాయంతో కార్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళ మద్యం మత్తులో ఉందా…లేక మతిస్థిమితం కోల్పోయిందా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version