తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 5 గురు మరణించారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది కారు. ఈ సంఘటనలో భారీ మంటలతో పూర్తిగా కాలిపోయింది కారు. ఈ సంఘటన లో ఐదుగురు మృతి చెందారు.
కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కిలోమీటర్ మేరా నిలిచింది ట్రాఫిక్. గంటపాటు మంటలు ఆర్పి ఐదుగురి మృతదేహం లను బయటకు తీసింది అగ్నిమాపక సిబ్బంది. ఇక ఈ సంఘటన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.