ఆరోగ్యం బాగుండాలి అంటే మంచి నిద్ర ఎంతో అవసరం. అయితే కొంతమంది సరైన నిద్ర లేకపోవడం వలన ఎంతో బాధపడుతూ ఉంటారు. కాకపోతే మరికొందరు ఎక్కువ సమయం నిద్రపోవడం వలన కూడా బాధపడతారు. అందుకే నిద్ర తక్కువైనా ఎక్కువైనా సరే అది పెద్ద సమస్య అని నిపుణులు చెబుతున్నారు. అతిగా నిద్రపోవడం వలన కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఈ సమస్యను హైపర్సోమ్నియా అని అంటారు. ఎప్పుడైతే నిద్రలో మార్పులు వస్తాయో జీవన విధానం మారిపోతుంది మరియు జీర్ణవ్యవస్థ పై ప్రభావం ముందుగా ఉంటుంది. దాంతో ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కనుక కేవలం కొన్ని గంటలను మాత్రమే పడుకోవాలి.
ఎందుకంటే నిద్రపోయిన సమయంలో ఎటువంటి శారీరక శ్రమ ఉండదు. దాంతో నడుము నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. దానితో పాటుగా రోజంతా ఎంతో బద్ధకంగా మరియు నీరసంగా ఉంటారు. అస్సలు యాక్టివ్ గా ఉండాలని అనిపించదు. ఈ విధంగా శరీరం యొక్క మెటబాలిజం తగ్గిపోతుంది మరియు బరువుని కూడా ఎంతో త్వరగా పెరిగిపోతారు. అతిగా నిద్రపోవడం వలన మెదడు పనితీరు కూడా సరిగా ఉండదు. దీంతో జ్ఞాపకశక్తి కు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎక్కువ సమయం నిద్రపోవడం వలన గుండె ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. ముఖ్యంగా గుండెకి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా శాతం మంది ఎక్కువ అలసిపోవడం వలన నిద్రపోతూ ఉంటారు. కాకపోతే నిద్ర అనేది పరిష్కారం కాదు, ఎందుకంటే ఎక్కువ సమయం నిద్రపోతే థైరాయిడ్, మధుమేహం వంటి మొదలైన దీర్ఘకాలిక సమస్యలు కూడా ఎదురవుతాయి. కనుక ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే తప్పకుండా ఏడు నుండి తొమ్మిది గంటల పాటు మాత్రమే నిద్రపోవాలి.