గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో అనునిత్యం రద్దీగా ఉండే ప్రాంతమైన అమీర్ పేట్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు ఉన్నట్టుండి ముందు వెళ్తున్న టూవీలర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి అమీర్ పేట్ నుంచి SR నగర్ వెళ్లే రోడ్డుపై సంభవించింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు ఇద్దరికీ తీవ్ర గాయాలు అవ్వగా.. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, కారు ప్రమాదానికి కారణమైన యువకులను స్థానికులు పట్టుకుని చితకబాదారు. అనంతరం మద్యం సేవించి కారు నడుపుతున్న యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.