ఎమ్మెల్యే జైవీర్ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ కాన్వాయ్‌లోని కారుకు ప్రమాదం జరిగింది. నల్గొండలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో గన్‌మెన్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుర్రంపోడు ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు జైవీర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

కాగా సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డి ఐఏసీసీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.ఈనెల 3న కేబినెట్ విస్తరణ ఉంటుందని టాక్ వస్తున్న క్రమంలో జానారెడ్డి లేఖ ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే ఆశావహుల జాబితాను హైకమాండ్‌కు పంపించినట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.