మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

-

సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సంక్రాంతి డ్రా నిర్వహించిన వ్యవహారంలో కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఏటా నిర్వహిస్తున్న డ్రా ఈసారి వివాదాస్పదమైంది. దీంతో జనసేన నేతల ఫిర్యాదుపై స్పందించిన కోర్టు పోలీసులకు కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది.

 

సత్తెనపల్లిలో కొన్నేళ్లుగా సంక్రాంతి డ్రా నిర్వహిస్తున్నారు. డ్రా పేరుతో స్ధానిక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్దమని తెలిసినా పట్టించుకోలేదు. ఈ డ్రా నిర్వహణకు మంత్రి అంబటి రాంబాబు సహకారం ఉందంటూ జనసేన నేతలు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం మంత్రిపై కేసు నమోదు చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో జనసేన నేతలు స్ధానిక కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్ధానం సంక్రాంతికి ముందే ఈ డ్రాపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version