గతంలో ప్రముఖ యాంకర్ గా బుల్లితెరపై ప్రత్యేకమైన పాపులారిటీ దక్కించుకున్న ఉదయభాను ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి సినిమాలకు దూరమై అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బుల్లితెర పై ప్రారంభ రోజుల్లో బుల్లితెర మహారాణిగా ఒక వెలుగు వెలిగిన యాంకర్ ఉదయభాను.. ప్రస్తుతం సుమ ఎంత బిజీగా ఉందో అప్పట్లో ఉదయభాను అంత బిజీగా ఉండేది. ఆమె అంగీకరించిన ఈవెంట్స్ కు భారీ మొత్తంలో పారితోషకం చెల్లించేవారు నిర్వాహకులు. అంతేకాదు ఆమె డిమాండ్ మేరకు పారితోషకం ఇచ్చేవారు అంటే ఆమె క్రేజ్ ఎంత ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే కెరియర్ సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా సాగుతుండగా ఆమె జీవితంలో అనూహ్యా పరిణామాలు చోటు చేసుకోవడం ఆమె కెరియర్ ను నాశనం చేసిందని చెప్పవచ్చు. ఆమె పెళ్లి ఆమె కెరియర్ ను మలుపు తిప్పింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బుల్లితెరకు ఎంట్రీ ఇవ్వకముందే 15 ఏళ్ల వయసులోనే ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుందని.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అతడితో విడిపోయింది అని ప్రేక్షకులు చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఒంటరిగా జీవితం సాగిస్తున్న ఉదయభాను కెరియర్ పై ఫోకస్ పెట్టి స్పెషల్ ఈవెంట్స్ కోసం యాంకర్ గా చేయాలంటే రోజుల తరబడి వారు వెయిట్ చేయాల్సి ఉండేది. కొన్నిసార్లు ఆమె వల్ల ఈవెంట్స్ వాయిదా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇకపోతే ఉదయ్ భాను బుల్లితెరపై తన హవా కొనసాగిస్తున్నప్పుడు విజయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే ఇతడు ఉదయభాను దగ్గర మొదటి డ్రైవర్ గా పని చేసేవాడు అని సమాచారం. అయితే ఇతడితో ఉదయభాను పెళ్ళికి ఆమె తల్లి అంగీకరించలేదు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయిన ఉదయభాను కొంతవరకు కెరియర్ను నాశనం చేసుకుందని చెప్పాలి . అయితే ఇప్పుడు వివాహం చేసుకొని ఇద్దరు ఆడపిల్లలతో హ్యాపీగా లైఫ్ కొనసాగిస్తోంది.