కంగనా పై దేశద్రోహం కేసు..అసలు కారణం ఇదే…!

-

బాలీవుడ్ నటి కంగనాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సుశాంత్ మరణం తర్వాత ఆమె ఏ కామెంట్ చేసినా పోలీసులు, మీడియా, కోర్టులు వెంటాడుతున్నాయి. మతపరమైన ట్వీట్లు చేసినందుకు ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది.ఆమెపై వర్గ ద్వేషాలను రెచ్చగొట్టారన్న అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా కంగనా అభ్యంతరకర ట్వీట్​ చేశారంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం ఆమెపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

మహారాష్ట్ర సర్కారుపై ఢీ అంటే ఢీ అంటూ వార్తల్లో పెను సంచలనంగా మారిన కంగనా రనౌత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఆమె చేస్తున్న ట్వీట్లతో పాటు ఇంటర్వ్యూలు కూడా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయ్‌‌. అంతేకాకుండా ముంబై పోలీసులను బాబర్స్ అంటూ కంగన పోల్చడం పెను దుమారం రేపింది.

కంగనా ట్వీట్లు, వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన బాంద్రా కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ముంబై పోలీసులు కంగనపై దేశ ద్రోహం కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version