బిగ్ బ్రేకింగ్ : జలీల్ ఖాన్ పై కేసు ?

-

ఇటీవల శాసనమండలిలో శాసన సభ చైర్మన్ షరీఫ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు లాగా కార్యకర్తలా అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును అడ్డుకోవడం జరిగిందని తీవ్రస్థాయిలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైసీపీ పార్టీ మంత్రులు విమర్శించడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే మైనార్టీ నేత జలీల్ ఖాన్… వైసిపి పార్టీ నాయకులు షరీఫ్ పై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ముఖ్యంగా బొత్స సత్యనారాయణ పెద్దాయన అనే గౌరవం కూడా లేకుండా మండలిఛైర్మన్‌ను ఉద్దేశించి .. నువ్వు సాయిబుకే పుట్టావా…అని అంటున్న బొత్స, తానెవరికి పుట్టాడో సమాధానం చెప్పాలని జలీల్‌ఖాన్‌ మండిపడ్డారు. ముస్లింల భాషలో బొత్స అంటే అడుక్కునే చిప్ప అనిఅర్థమని, దానికి తగినట్లే బొత్స ప్రవర్తన కూడా ఉందన్నారు. చరిత్రలో, స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలకు ఒకచరిత్ర ఉందని, అలాంటివారిని పట్టుకొని సాయిబు అంటే బట్టలూడదీసి కొడతారని బొత్స గుర్తుంచుకోవాలన్నారు.

 

అయితే ఆ తర్వాత మండలి చైర్మన్ షరీఫ్ మీడియా సమావేశం పెట్టి అధికార పార్టీకి చెందిన మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ ఎవరు నన్ను శాసనమండలిలో విమర్శించలేదని వివరణ ఇవ్వడంతో ముఖ్యంగా  బొత్స తనని ఏమే అనలేదు అని షరీఫ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో పూర్తిగా తెలుసుకోకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జలీల్ ఖాన్ పై బొత్స కేసు పెడతాకి రెడీ అవుతున్నట్లు వైసిపి పార్టీలో వినబడుతున్న టాక్ 

Read more RELATED
Recommended to you

Exit mobile version