కుక్కని సరస్సులో పడేసిన వ్యక్తిపై కేసు నమోదు..

-

భోపాల్.. శ్యామ్ లాల్ ప్రాంతంలో ఉన్న బోట్ క్లబ్ వద్ద రైలింగ్ లో నుండి కుక్కని సరస్సులోకి పడవేస్తున్న వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సాయంత్రం పూట కుక్కని సరస్సులోకి విసిరేస్తూ, వీడియో తీస్తున్న వ్యక్తివైపు తిరిగి నవ్వుతూ కనిపించిన వ్యక్తిపై భోపాల్ శ్యామ్ లాల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 429 ప్రకారం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసింది. ఈ సెక్షన్ ప్రకారం యాభై రూపాయల కంటే ఎక్కువ విలువగల జంతువులని చంపడం నేరం..

ఐతే ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని పేరు సల్మాన్ ఖాన్ అని తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి జంతు హింస చాలా చేసాడని పోలీసుల విచారణలో కనుక్కున్నారు. కుక్కని పడేసినందుకు గాను, అలాగే వీడియో తీసిన వ్యక్తిపై కేసు నమోదు చేసారు. ప్రస్తుతం వీరిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఐతే సంఘటన ఎప్పుడు జరిగిందనేది మాత్రం తెలిసిరాలేదు. నిందితుడు స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం అది చాలా పాత వీడియో అని పోలీసులు తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version