కాలేజీ లో చేరేందుకు నకిలీ ఇంటర్ మెమో సమర్పించిన కేసులో బిజెపి ఎమ్మెల్యే కు ఆలస్యంగా జైలు శిక్ష పడింది. ఉత్తరప్రదేశ్ లోని గోసాయి గంజి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారి చదువుకుంటున్న రోజుల్లో 1990 లో అయోధ్య లోని సాకేత్ డిగ్రీ కాలేజీలో నకిలీ ఇంటర్ మెమో సమర్పించి అడ్మిషన్ పొందారు. అదే కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నారు. సెకండ్ ఇయర్ లో ఆయన ఫెయిల్ అయ్యారు.
అయితే ఆ కాలేజీ ప్రిన్సిపల్ తివారి నకిలి ఇంటర్ మెమో ను సమర్పించి అడ్మిషన్ పొందినట్టుగా గుర్తించారు. దాంతో 1992 లో తివారి పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ప్రస్తుతం తివారి ఎమ్మెల్యే గెలిచి పదవిలో ఉన్నారు. 1992 లో నమోదయిన కేసులో ఎట్టకేలకు తివారి కి శిక్ష పడింది. ఎమ్మెల్యేకు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఎనిమిది వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.