విజయసాయి రెడ్డి….వైసీపీలో నెంబర్ 2 నాయకుడు. జగన్ తర్వాత వైసీపీలో నెక్స్ట్ స్థానం విజయసాయిదే అని ఆ పార్టీ శ్రేణులు భావిస్తుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా విశాఖపట్నం వైసీపీకి హెడ్. ఉత్తరాంధ్రలో వైసీపీని నడిపించే నాయకుడు. 2014 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయాక….విశాఖలో సెటిల్ అయ్యి, పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చి…2019 ఎన్నికల్లో వైసీపీకి అదిరిపోయే ఫలితాలు వచ్చేలా చేశారు.
రాజ్యసభ సభ్యుడుగా ఉంటూ, విశాఖ రాజకీయాలని నడిపించారు. ఇక్కడ ఏదైనా విజయసాయి ఆదేశాల మీద ఆధారపడే రాజకీయం నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ టిడిపికి చుక్కలు చూపించే నాయకుడు విజయసాయి. అయితే అంతలా ఉత్తరాంధ్ర రాజకీయాలపై తనదైన ముద్రవేసిన విజయసాయి…ఈ మధ్య దూకుడుగా రాజకీయాలు చేయడం తగ్గించారు. అసలు ప్రతిరోజూ చంద్రబాబు అండ్ బ్యాచ్‌పై విరుచుకుపడే విజయసాయి…ఈ మధ్య విమర్శల జోలికి వెళ్ళడం లేదు.
కేవలం విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలపైనే విజయసాయి ఫోకస్ చేశారు. అసలు ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం లేదు…కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. అయితే విజయసాయిలో ఇంతలా మార్పు రావడానికి కారణాలు తెలియడం లేదు. అంటే జగన్ ఆదేశాల ప్రకారం అలా నడుచుకుంటున్నారా? ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయా? అనేది క్లారిటీ లేదు.
కానీ నెక్స్ట్ ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలో పోటీ చేయడానికి విజయసాయి రెడ్డి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు రాజ్యసభ సభ్యుడుగా ఉన్న విజయసాయి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఇంతకాలం విశాఖ రాజకీయాలపై పట్టు తెచ్చుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు. అలాగే సాయన్న దర్బార్ పేరిట విశాఖ ప్రజల సమస్యలని పరిష్కరించడానికి సిద్దమయ్యారు. ఇవన్నీ నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికే సాయిరెడ్డి చేస్తున్నారని తెలుస్తోంది. విశాఖ పార్లమెంట్ బరిలో పోటీ చేసి సత్తా చాటాలని అనుకుంటున్నారట. చూడాలి మరి విశాఖ బరిలో విజయసాయి పోటీ చేస్తారో లేదో?