11 మంది యూట్యూబర్ల పై కేసులు

-

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారని యూట్యూబర్ల పై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. తాజాగా 11 మంది యూట్యూబర్ల పై కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. వీరిలో విష్ణు ప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా బన్నీ యాదవ్ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.

మరోవైపు బెట్టింగ్ యాప్స్ పై నటుడు సంపూర్ణేష్ బాబు సందేశం ఇచ్చారు.  కొందరు యువత బెట్టింగ్ వంటి అనవసరమైన వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ ల వల్ల బాగుపడినట్టు చరిత్రలో లేదు. వీటికి బానిస అయ్యే ముందు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించండి. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అని పోస్ట్ చేశాడు. సంపూర్ణేష్ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే 11 మంది యూట్యూబర్ల పై కేసులు నమోదు చేయడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version