తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మెంటల్ ఎక్కిందని, మానసిక రోగం వచ్చిందిని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా జర్నలిస్టులను బట్టలు ఊడదీసి కొడతా అని మాట్లాడతున్నాడు. స్పీకర్ ఖండించకుండా నవ్వుకుంటు ఎంజాయ్ చేస్తున్నాడు. జీతాలకు పైసలు లేవు, హామీలు అమలు చేయడానికి చేతకాదు. కేసీఆర్ ని, కేటీఆర్ ని, జగదీశ్ రెడ్డిని ఏదో ఒక మాట అని వీటి నుండి తప్పించుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని వెల్లడించారు.
జగదీష్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఉచ్చపడుతుంది. స్పీకర్ అంటే స్పీకరే.. దళిత స్పీకర్, రెడ్డి స్పీకర్ ఉండడు. స్పీకర్ అనే వాళ్ళను దళితుడు, దళితుడు అని కాంగ్రెస్ వాళ్ళే అవమానిస్తున్నారు. ఒక పదవీ వచ్చిన తర్వాత కూడా ఆయనను దళితుడుగా చూస్తున్నారు. కానీ స్పీకర్‌గా చూడటం లేదు. జగదీష్ రెడ్డి స్పీకర్‌ను ఏమీ అనలేదు.. మీకు జగదీష్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే ఉచ్చపడుతుంద.. అందుకే సస్పెండ్ చేశారని పేర్కొన్నారు గాదరి కిషోర్.