రోహింగ్యాలపై కేసులు, సర్జికల్ స్ట్రైక్స్ అన్న వారి మీద కూడా: డీజీపీ

-

మూడు కమిషనరేట్ పరిధిలో ముగ్గురు సీపీ లు, ఇద్దరు ఐజీలు, డీఐజీ లతో సమావేశం ఏర్పాటు చేశాము అని తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఎలక్షన్ సజావుగా జరిగేలా మేము 100 కి 100 శాతం సక్సస్ అవుతామనే నమ్మకం ఉంది అని డీజీపీ అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి , లబ్ది పొందాలని చూసే వారిపై చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేసారు. ఎవరైనా రెచ్చ గొట్టే విధంగా ప్రసంగాలు చేస్తే వాటిని పరిశీలించి సీపీ లు చర్యలు తీసుకుంటారు అని ఆయన స్పష్టం చేసారు.

ఇప్పటి వరకు గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో 50 కేసులు నమోదు చేశాము అని ఆయన వివరించారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతల పై కేసుల నమోదు చేస్తాం అని స్పష్టం చేసారు. రోహింగ్యాల పై ఇప్పటి వరకు 50 -60 కేసులు నమోదు చేశాం అని వివరించారు. క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని, ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదు తో తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశాం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version