Big News : కవిత సీబీఐ విచాణపై ఉత్కంఠ.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు సీబీఐ అధికారులు

-

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో ఇవాళ ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనుంది. సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ అలోక్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేడు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెను విచారించాల్సి ఉంది. కానీ ఈ రోజు విచారణకు హాజరుకాలేనని సీబీఐకి కవిత లేఖ రాశారు. ఈ నెల 11,12,14,15 తేదీల్లో విచారణకు హాజరవుతానని వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత లేఖకు సీబీఐ అధికారులు రిప్లై ఇవ్వలేదు.

సీబీఐ నిర్ణయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు విచారణకు హజరవ్వాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీఎం సభ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం నేడు జగిత్యాలకు కవిత వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే సీబీఐ వర్సెస్ కవిత ఎపిసోడ్‌లో హై టెన్షన్ నెలకొంది. అయితే ఇప్పటికే జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు సీబీఐ అధికారులు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version