7th Pay Commission: కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతం గురించి గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి బెనిఫిట్ కలగనుంది అని చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. సెప్టెంబర్‌ నెల లో డియర్‌నెస్ అలవెన్స్ , డియర్‌నెస్ రిలీఫ్ 4 శాతం పెరిగిన తర్వాత.. మళ్ళీ పెంచనున్నట్లు తెలుస్తోంది.

డీఏ, డీఆర్‌లను 3-5 శాతం మార్చి 2023లో పెంచచ్చట. అలానే ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ మీద కూడా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది. డీఏ 41 నుంచి 43 శాతానికి కొత్త సంవత్సరంలో చేరుతుందిట. 18 నెలల డీఏ బకాయిలు కూడా ఇవ్వాలని ఉద్యోగులు అంటున్నారు. 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు దీపావళి, పండుగల సీజన్‌కు ముందు డీఏ, డీఆర్‌లను 4 శాతం పెంచారు. జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చింది.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 38 శాతం డీఏ వస్తోంది. డీఏను 3 నుంచి 5 శాతం వరకు మార్చితే 41 నుంచి 43 శాతం మధ్య ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీలలో ఈ అలవెన్సులను మారుస్తుంది. అలానే ఫిట్‌మెంట్ అంశంలో కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగులు అంటున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచినప్పుడు బేసిక్ జీతం రూ.6 వేల నుంచి రూ.18 వేలకు గత ఏడాది పెరిగింది. ఇప్పుడు మార్చయితే రూ.18 వేల నుంచి రూ.26 వేలకు జీతం పెరుగుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version