రామోజీ..నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి – చంద్రబాబు

-

నేడు ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో రామోజీరావు కు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్వయం కృషితో, పట్టుదలతో వృద్ధిలోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తిగా మీరు నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

ఇక అటు నారా లోకేష్ కూడా రామోజీరావుకు శుభాకాంక్షలు తెలిపారు. విలువలపై నిలువెత్తు తెలుగు సంతకం ఈనాడు ఛైర్మన్ పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజా సంక్షేమానికి, తెలుగు రాష్ట్రాల ప్రగతికి ఈనాడు సంస్థలని అంకితం చేసిన మార్గదర్శి ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. క్రమశిక్షణ-పారదర్శకత -నైతిక విలువలతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి.. ఎంతోమందికి ఉపాధి కల్పించిన మీడియా మొఘల్ రామోజీరావు గారి జీవిత ప్రస్థానం స్ఫూర్తిమంతం అని పేర్కొన్నారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version