నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ అవతరణ.. కరెక్టేనా..?

-

నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఓ పండుగలా వేడుకలు నిర్వహించేందుకు నిర్ణయించింది. నవంబర్‌ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను  ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో వేడుకలు అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి.

జిల్లాల్లో నిర్వహించే  వేడుకలకు ముఖ్యఅతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు హాజరవుతున్నారు. అయితే అసలు నవంబర్ ఒకటిన ఏపీ అవతరణ దినోత్సవం జరపడం కరెక్టు కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. 1953 కి పూర్వం తెలంగాణ ఒక రాష్ట్రంగా ప్రస్తుతం ఉన్న ఆంద్రప్రదేశ్ తమిళనాడులో కలిసి ఉండేది. కోస్తా , రాయలసీమ పెద్దల అంగీకారంతో శ్రీభాగ్ ఒప్పందం షరతుతో తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో పొట్టిశ్రీరాములు ఆత్మార్పణతో 1953 అక్టోబరు 1న తొలి భాషప్రయోక్త రాష్ట్రంగా ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రూపంలో నాడు ఆంధ్రరాష్ట్రం అవతరించింది. ఆ తరువాత ఆంధ్రరాష్ట్రం , తెలంగాణ కలిపి పెద్దమనుషుల అవగాహన మేరకు విశాలాంధ్రగా 1956 నవంబరు 1 ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అలా ఏర్పడిన ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఇంకా నవంబర్ ఒకటినే రాష్ట్ర అవతరణ వేడుక జరపడం అసంబద్దంగా అనిపించకమానదు.

అంతగా రాష్ట్రావతరణ చేయదలిస్తే.. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ మొదటిసారిగా ఏర్పడిన అక్టోబర్ 1న చేయవచ్చు. లేదంటే.. ఏపీకి ఇష్టం ఉన్నా లేకపోయినా నవ్యాంధ్ర ఏర్పడిన జూన్ 2న చేయవచ్చన్న వాదన వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version