మన దేశంలో హక్కుల ఉల్లంఘన జరిగిపోతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొందరు విదేశీ సెలబ్రిటీలు. వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దులో రైతుల ఉద్యమాన్ని సాకుగా చూపించి సోషల్ మీడియాలో స్పందించడంపై దుమారం రేగుతోంది. అయితే, దీనికి మన సెలబ్రిటీలు కౌంటర్ ఇస్తున్నారు. ఇండియా టుగెదర్, ఇండియా ఎగెనెస్ట్ ప్రాపగండా హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టులు పెడుతున్నారు.
ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసి… రైతుల గొంతు నొక్కేస్తున్నారంటూ కథనం రాసుకొచ్చింది సీఎన్ఎన్. ప్రజాస్వామ్యంపై మన దేశంలో ఉక్కుపాదం మోపేస్తున్నట్టు గగ్గోలుపెట్టింది. అదేదో నిజమే అని భావించారు అమెరికా పాప్ గాయని రిహానా, క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బెర్గ్, పార్న్ స్టార్ మియా ఖలీఫా లాంటి వాళ్లు స్పందించారు. దీనిపై మనం ఎందుకు మాట్లాడం అంటూ పది కోట్ల మంది ఫాలోవర్స్ గల రిహానా… ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసింది. సీఎన్ఎస్ రిపోర్టును రిహానా ట్యాగ్ చేసింది. దీంతో అమెరికా, బ్రిటన్‌లకు చెందిన కొంత మంది ప్రజాప్రతినిధులు కూడా వాళ్లతో గొంతుకలిపారు.
రైతుల ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కొంత మంది మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. పంజాబ్, హార్యానాల్లో బలపడాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీపార్టీ… ఆందోళనకారులకు దగ్గరుండి సదుపాయాలు సమకూర్చుతోంది. ఇదే అదనుగా కొంత మంది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. దీని పై వివరణ ఇచ్చింది భారత విదేశాంగ శాఖ.మన దేశానికి చెందిన పలువురు సెలబ్రిటీలు స్పందించారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కరణ్ జోహార్ వంటి వాళ్లు ప్రభుత్వానికి మద్దతుగా ఇండియా టుగెదర్, ఇండియా ఎగెనెస్ట్ ప్రాపగండా హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెట్టారు.
క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండర్లు ఇండియా టుగెదర్, ఇండియా ఎగెనెస్ట్ ప్రాపగండా హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెట్టారు. అందరం కలిసికట్టుగా ఉందాం. దేశంలో రైతుల కీలక భూమిక పోషిస్తున్నారని, వాళ్ల సమస్యపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ట్వీట్ చేశారు విరాట్ కోహ్లీ. ఈ విషయంలో అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్లాలని కోరారు విరాట్.
మొత్తానికి ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్‌ట్యాగ్‌తో రిహానా ప్రారంభించిన ట్వీట్‌వార్‌లో… ఇండియా టుగెదర్, ఇండియా ఎగెనెస్ట్ ప్రాపగండా హ్యాష్‌ట్యాగ్‌లతో గట్టిగానే బదులిస్తున్నారు మన సెలబ్రిటీలు.