అసలే కరోనా వైరస్ తో భయపడి చస్తున్న జనాలకు ఇప్పుడు విశాఖ లో లీక్ అయిన విష వాయువులు మరింత ఆందోళన గా మారాయి. సింహాచలం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి చాలా వరకు ఆందోళనగా మారింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ లో దాదాపు మూడు గంటల పాటు గ్యాస్ లీక్ అయింది. సౌత్ కొరియాకు చెందిన ఈ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంతో కేంద్ర ప్రభుత్వం కూడా లేర్ట్ అయింది.
నిద్రలో ఉన్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు అందరూ కూడా శ్వాస సంబంధిత ఇబ్బందులు పడ్డారు. చాలా మంది అలెర్ట్ అయ్యే సమయం కూడా లేకుండా పోయింది. కళ్ళు మంటలు, కడుపులో నొప్పి రావడంతో ప్రజలు అందరూ ఇళ్ళ నుంచి పరుగులు తీసారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో కేంద్ర బృందాలు రంగంలోకి దిగాయని అంటున్నారు. కేంద్ర హోం శాఖ పరిస్థితిని ఆరా తీసింది.
ఓడిస్సా లో ఉన్న కేంద్ర బృందాలను కూడా విశాఖ వెళ్ళాలి అని, హైదరాబాద్ నుంచి కూడా కేంద్ర బలగాలు వెళ్ళాలి అని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. గ్యాస్ కంపెనీలో 3 విష వాయువు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక కళ్ళు కనపడక బావిలో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటీ అనేది అధికారులు ఒక అంచనాకు రాలేక పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది.