ప్రశాంతంగా ఉండే విశాఖ నగరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. అర్ధ రాత్రి సమయంలో విష వాయువులు లీక్ అయ్యాయి. దీనితో ఇళ్ళ నుంచి ప్రజలు అందరూ బయటకు వచ్చి పరుగులు తీసారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనాలు పరుగులు తీసారు. ఒక్కసారిగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి పెద్దమొత్తంలో ప్రమాదకర విష వాయువు లీక్ అయ్యింది. గాల్లోకి వ్యాపించి చుట్టుపక్కల ప్రజల్ని కమ్మేసింది.
శ్వాస ఇబ్బంది మొదలు, ఊపిరి సలపకుండా పరిస్థితి మారింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ వాయువు విస్తరించింది. ఆర్ఆర్ఆర్ వెంకటాపురం గ్రామాల్లో ప్రజలు భయపడిపోయారు. కొంత మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. కొంత మంది కళ్ళు తిరిగి పడిపోయారు. వృద్దులు బాగా ఇబ్బంది పడుతున్నారు. 5 గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. విశాఖ జిల్లా కలెక్టర్ తో జగన్ మాట్లాడారు.
అప్రమత్తమైన అధికారులు చాలా వేగంగా చర్యలు చేపట్టారు. వందల మంది తీవ్ర ఆశ్వస్తతకు గురి కావడంతో ప్రజలను ఆస్పత్రులను అంబులెన్స్లలో తరలించారు. ప్రజలు అందరూ ఇప్పుడు సొంత వాహనాలతో దూరంగా వెళ్ళిపోతున్నారు. చిన్న పిల్లల తల్లి తండ్రుల్లో ఆందోళన మొదలయింది. కొంత మంది కళ్ళు తిరిగి పడిపోయారు రోడ్ల మీద. ప్రత్యేక బృందాలను విశాఖ తరలిస్తున్నారు.