రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం భారీ హెచ్చరికలు జారీ చేసింది. డ్రోన్లు, IEDలతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని శనివారం కేంద్రహోంశాఖ హెచ్చరికలు పంపింది.
సముద్ర తీర ప్రాంత పరిధిలోని పట్టణాలను ముఖ్యంగా కేంద్రం అలర్ట్ చేసింది. ఇక సముద్ర తీర ప్రాంతాల్లో నిఘా పెంచాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్, 26/11 ముంబై పేలుళ్ల కుట్రదారు తహవ్వూర్ రాణాను ఎన్ఐఏ అరెస్టు చేసి తన కస్టడీలో ఉంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్రలను అలర్ట్ చేసింది.