దాసారం బస్తీపై ప్రైవేటు వ్యక్తుల కన్ను.. జనాలను ఖాళీ చేసే కుట్ర

-

దాసారం బస్తీపై ప్రైవేట్ వ్యక్తుల కన్ను పడినట్లు సమాచారం. దీంతో బస్తీ వాసులను అక్కడి నుంచి ఖాళీ చేసే కుట్రకు వారు తెరలేపాు. అమీర్ పేట మండలం బీకే గూడలో సర్వే నంబరు 144 మూడున్నర ఎకరాల స్థలంపై ప్రైవేటు వ్యక్తుల కన్ను పడగా.. గత 30 ఏండ్లుగా గుడిసెలు వేసుకొని ఉంటున్న పేదలను ఖాళీ చేసేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

100కు పైగా గుడిసెలను ఖాళీ చేసే ప్రయత్నాలు మొదలెట్టారని.. స్థలాన్ని చదును చేయిస్తున్నారని పేదల ఆవేదన వ్మక్తం చేస్తున్నారు. కాగా, గతంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడి పేదల కోసం డ్రైనేజీ, నల్లా కనెక్షన్ ఇప్పించారు. ఇప్పుడేమో వారినివెళ్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news