సరికొత్త మార్గదర్శకాల్లో ఆ పాయింట్ గమనించారా ? ఇదే ధైర్యం ఇస్తోంది !!

-

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుండి ఏవిధంగా ఉండాలో సరికొత్త లాక్ డౌన్ మార్గదర్శకాలు తాజాగా రిలీజ్ చేసింది. ఈ మార్గదర్శకాల్లో పరిమితంగా నిర్మాణరంగ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆ పనులు చేసే కార్మికులు కోసం స్థానికంగా ఉన్న వాళ్ళ చేతనే పని చేయించాలని తెలిపింది. అంతేకాకుండా వ్యవసాయ మరియు అనుబంధ పరిశ్రమలకు కూడా అనుమతి ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలు నిర్వహణకు కూడా అనుమతి ఇవ్వటం జరిగింది. పట్టణ పరిధిలో లేని అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణా లు జరగకూడదని బంద్ చేసింది. రాష్ట్రాలలో హాట్ స్పాట్ లను ప్రకటించే అధికారం రాష్ట్రాలకే ఉంటుందని స్పష్టం చేసింది. కాఫీ తేయాకు ఉత్పత్తి పంటలకు 50 శాతం మ్యాన్ పవర్ కి అనుమతి ఇచ్చింది.ఏప్రిల్ 20 నుండి ఈ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని తెలిపింది. ఖచ్చితంగా పబ్లిక్ లో మాస్కు లు ధరించాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో అయినా కచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పది మంది కంటే ఎవరు గుమ్మి కుడి ఉండకూడదని స్పష్టం చేసింది. ఉద్యోగులు మరియు కార్మికులు ఎక్కువగా ప్రభుత్వ రవాణా పై ఆధార పడకుండా ఎవరికి వాళ్ళు సొంత వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. మరియు అదే విధంగా వాహనాల కార్మికులు విధులు నిర్వహించే సామాగ్రిని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చెయ్యాలని, ఆఫీసుల్లో కనీసం ఒకరికొకరు ఆరు అడుగుల దూరం పాటించాలని సూచనలు జారీ చేసింది.

 

విధులు నిర్వహించే వారికి మెడికల్ ఇన్సురెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన ఈ సరికొత్త మార్గదర్శకాల్లో ఒకే ఒక కామన్ లాజిక్ పాయింట్ ఏమిటంటే సోషల్ డిస్టెన్స్. దూరం దూరంగా కొన్ని శాఖలు పనులు చేసుకోవచ్చు అంటున్నారు .. దాని అర్ధం నెంబర్ లు తగ్గుతున్నాయి అనే ఫీలింగ్ లో కేంద్రం ఉన్నట్టే .. 20 తరవాత పరిస్థితి అదుపులోకి వస్తుంది అనే నమ్మకం తో కేంద్రం ఉన్నట్టే ప్రస్తుత మార్గదర్శకాలు బట్టి తెలుస్తోంది. మొత్తంమీద చూసుకుంటే ఏప్రిల్ 20 తర్వాత ప్రజలకు ధైర్యం కలిగించే విధంగానే కేంద్ర ప్రకటన ఉండేటట్లు అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version