విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రం.. కీలక అంశాలతో ఏపీ హైకోర్టులో అఫిడవిట్

-

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. ప్రవేటీకరణపై స్పష్టతిస్తూ ఈ రోజు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్‌లో కీలక అంశాలను పేర్కొంది. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలిస్తామని కేంద్ర తెలిపింది. వందశాతం స్టీల్ ప్రాంట్‌ను అమ్ముతామని, ఇప్పటికే బిడ్డింగ్‌ను ఆహ్వానించామని కేంద్రం అఫిడవిట్‌లో వెల్లడించింది. పిటిషన్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారని, ఆయన రాజకీయ ఉద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేశారని, దీనికి విచారణ అర్హత లేదని అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది.

ఇక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసింది. ప్లాంట్‌ను అమ్మేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి విశాఖ వాసులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరుతున్నారు. అన్ని పార్టీల నాయకులు కూడా ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, అందులో పేర్కొన అంశాలు మరింత అందోళనకు గురి చేసేవిగా ఉన్నాయని, నిరసనలు మరింత ఉధృతమవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version