కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్

-

గులాబీ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన తెల్లం వెంకట్రావు మంచి మనసు చాటుకున్నారు. ఓ కాంగ్రెస్ నేతకు గుండెపోటు వస్తే వెంటనే సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు తెల్లం వెంకట్రావు. ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పర్యటించారు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు. ఈ నేపథ్యంలో వారితో ఉన్న సుధాకర్ అనే కాంగ్రెస్ నేతకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.

Congress leader suffers heart attack, MLA Tellam Venkatrao saves his life by performing CPR

ఇంకే ముంది గుండెపోటు రావడం తో కుప్పకూలాడు సుధాకర్. అక్కడే ఉన్న తెల్లం వెంకట్రావు… వెంటనే అలర్ట్ అయి… సిపిఆర్ చేశాడు చేశాడు. అలాగే అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు కూ డా సహకరించారు. దీంతో ప్రాణాలతో కాంగ్రెస్ నేత సుధాకర్ బయటపడ్డాడు. అనంతరం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version