కేంద్ర ఉద్యోగులకు కీలక అప్‌డేట్. కరువు భత్యం పెంపు బహుమతిని కేంద్రం ఇవ్వనుంది. జూలై 31న, AICPI ఇండెక్స్ గణాంకాలను అయితే కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది.
ఇక మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ని ఎంత శాతం పెంచారో చూసేద్దాం. ఇప్పటి వరకు డియర్‌నెస్ అలవెన్స్ లో 4 శాతం పెంపు వుండచ్చని తెలుస్తోంది. జనవరి నుండి ప్రభావవంతమైన డీఏ 42 శాతం, ప్రభుత్వం జులై తర్వాత డీఏ పెంచినట్లయితే డియర్‌నెస్ అలవెన్స్ 46 శాతానికి పెరగవచ్చు. 4 శాతం డీఏ పెరుగుతుంది కనుక.
మే 2023 వరకు ఉన్న గణాంకాలను ఇప్పటి దాకా కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో డియర్‌నెస్ అలవెన్స్ రేటు 45.57 పాయింట్లకు చేరగా.. ఈ లెక్కన 4 శాతం డీఏ పెంపు దాదాపు పెరగచ్చని తెలుస్తోంది. జూన్‌కు సంబంధించిన గణాంకాలు జూలై 31న విడుదల అవుతాయి. తర్వాత డీఏ ఎంత శాతం పెరుగుతుందనేది తెలుస్తుంది. జూలైలో 4 శాతం డీఏ పెంపు ఉంటుంది.
అప్పుడు డీఏ 46 శాతానికి పెరుగుతుంది. ఒక ఉద్యోగి మూల వేతనం రూ.18000 అయితే 42% డీఏ విధిస్తారు. అంటే డియర్‌నెస్ అలవెన్స్ రూ.7560. 46 శాతం డియర్‌నెస్ అలవెన్స్ కి నెలకు రూ.8280 అవుతుంది. ప్రతి నెలా రూ.720 పెరుగుతుంది. ఏడాదికి రూ.8 వేలకు పైగా పెరుగుదల.