కార్గిల్‌ హీరోకు ఇండిగో అపూర్వ సత్కారం.. వీడియో వైరల్‌

-

దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడిన కార్గిల్ యుద్ధ వీరుడికి విమానయాన సంస్థ ఇండిగో ఘనస్వాగతం పలికింది. పరమ్‌ వీర్‌ చక్ర (అవార్డు గ్రహీత సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌ ఆదివారం పుణె వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించారు. విమానం టేకాఫ్‌కు ముందు ఆయనను గౌరవిస్తూ కెప్టెన్‌ ప్రత్యేక అనౌన్స్‌మెంట్‌ చేశారు.

‘‘ఈ రోజు విమానంలో మనతో పాటు పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌ ఉన్నారు. యుద్ధ వీరుల ధైర్యసాహసాలకు ఇచ్చే అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డు ఇది. భారత చరిత్రలో ఇప్పటివరకు కేవలం 21 మంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు’’ అని కెప్టెన్‌ చెప్పడంతో తోటి ప్రయాణికులంతా చప్పట్లతో ఆయనను అభినందించారు.

అనంతరం సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌ దేశానికి అందించిన సేవలను కూడా కెప్టెన్‌ వివరించారు. ప్రయాణికులంతా చప్పట్లతో ఆయనను గౌరవించగా.. ఇండిగో సిబ్బంది చిరు కానుకను అందించి ఆయనను సత్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండిగో తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘హీరోతో కలిసి విమాన ప్రయాణం’’ అని క్యాప్షన్ జోడించింది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news