తెలుగు రాష్ట్రాలకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ నిధుల విడుదల

-

ఏపికి ఏడో విడత కింద 125 కోట్లు జి.ఎస్.టి పరిహారం విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏడు విడతలు కలిపి ఏపికి మొత్తం రూ.1055.07 కోట్లు విడుదల అయ్యాయి. తెలంగాణకు ఏడో విడతగా రూ.129 కోట్లు విడుదల అయ్యాయి. ఇక ఏడు విడతలుగా మొత్తం తెలంగాణకు 559.02 కోట్లు లభించాయి. ఏడవ విడతగా 23 రాష్ట్రాలకు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 6 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్రం. ఏడవ విడత జి.ఎస్.టి నష్టపరిహారం కింద 23 రాష్ట్రాలకు రూ. 5,516.60 కోట్లు కాగా, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఢిల్లీ, పుదిచ్చేరి, జమ్మూ-కాశ్మీర్—రూ.483.40 కోట్లు ఇచ్చింది కేంద్రం. ఇక ఏడు విడతలు కలిపి మొత్తం ఇంత వరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 42 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ కు ఏడో విడత కింద రూ.125 కోట్లు జి.ఎస్.టి నష్ట  పరిహారాన్ని ఇచ్చినట్టుగా సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఏడు విడతలుగా మొత్తం ఏపీకి రూ.1055. 07 కోట్లు ఇచ్చింది కేంద్రం. ప్రత్యేక రుణ సదుపాయం ద్వారా బ్యాంకుల నుంచి కేంద్రం రుణాన్ని తీసుకుని రాష్ట్రాలకు ఈ నిధులను విడుదల చేసిందికేంద్రం. ఈ మొత్తం బ్యాంకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి తీర్చాల్సి ఉంది.  అలాగే,  రూ.5,051 కోట్లు అదనపు రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అనుమతించింది. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తీర్చాల్సి ఉంటుంది. తెలంగాణకు కూడా రూ. 5,017 కోట్లు అదనంగా రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దేశంలో 5 రాష్ట్రాలలో—మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం—జి.ఎస్.టి అమలు వల్ల ఆదాయ నష్టం జరగలేదు.  “ఆప్షన్-1” ని ఎంపిక చేసుకున్న 28 రాష్ట్రాలకు మొత్తం ఒక లక్ష ఆరు వేల 830 కోట్లు అదనపు రుణం పొందేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version