తెలంగాణలో కరోనా కేసు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేసులు కాస్త తక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాప్రతినిధులకు కూడా కరోనా ఎక్కువగా సోకుతుందని చెప్పచ్చు. తాజాగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కూడా తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ విషయాన్ని స్వయంగా మంత్రి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. తాజాగా చేసిన #RTPCR పరీక్షల్లో నాకు #COVID పాజిటివ్ అని తేలింది.దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను. అని ఆయన పేర్కొన్నారు.
#RTPCR పరీక్షల్లో నాకు #COVID పాజిటివ్ అని తేలింది.దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను.
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) December 15, 2020