అన్నదాతలకు గుడ్ న్యూస్..కేంద్రం సరికొత్త పధకం …!

-

రైతులకి మోదీ సర్కార్ తీపి కబురు అందిస్తోంది. రైతులు ఆదాయాన్ని పెంచాలని తీవ్రంగా శ్రమిస్తోంది సర్కార్. అందుకనే రైతుల కోసం మరో కొత్త స్కీమ్ ని ప్రవేశ పెట్టింది. అయితే దీనిలో 11 మంది రైతుల తో కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడాలి. ఆ తర్వాత వీళ్ళకి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని వల్ల రైతులకు చక్కటి ప్రయోజనం కలుగుతుంది. ఎఫ్ పి ఓ విధానంలో కొంత మంది రైతులు గ్రూపులుగా ఏర్పడాలి. ఆ తర్వాత ఎఫ్ పి ఓ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. అలాగే పలు రకాల వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలి.

farmers-with-crops

అయితే ఒక గ్రూప్ గా ఏర్పడిన తర్వాత ఒక స్కీమ్ లో రిజిస్టర్ అవ్వాలి. ఇలా చేస్తే కచ్చితంగా వాళ్ళకి కేంద్రం నుంచి ప్రయోజనం లభిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక్క గ్రూప్ కి రూపాయలు 15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఈ విషయం పై వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి చెబుతూ ప్రభుత్వం ఎఫ్ పి ఓ లను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇందులో చేరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

సన్నకారు రైతులు 11 మంది కలిసి గ్రూప్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఫర్టిలైజర్స, విత్తనాలు, మందులు వంటి వ్యవసాయ ఉపకరణాలు వంటి సులభంగా కొనుగోలు చేయవచ్చు. రైతులు పంటలు దీని ద్వారా విస్తరించుకోవచ్చు. 2023 – 2024 నాటికి పదివేల ఎఫ్ పీ ఓ లను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వం ఐదేళ్ల పాటు వీటికి సహాయం అందిస్తుంది. ప్రభుత్వానికి ఖర్చు రూ 6866 కోట్లు అవ్వనుంది. అయితే మోదీ సర్కార్ ఒక్క ఎఫ్ పి ఓ కి రూపాయలు 15 లక్షలు అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్‌ను తయారు చేసుకొని పనులు ప్రారంభించొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version