మేకను అరెస్ట్ చేసిన పోలీసులు… ఎందుకో తెలిస్తే షాక్..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దింతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా మాస్కులు ధరించకుండా బయటికి వచ్చిన ప్రజలపై భారీ జరిమానా విధిస్తున్నారు. అయితే తాజాగా యూపీ పోలీసులు మేక మాస్కు ధరించలేదని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

goat

ఓ మేక మాస్క్ లేకుండా అటు ఇటు తిరుగుతూ పెద్దగా అరుస్తుందని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆ మేక యజమాని మేకను పోలీసులు తీసుకెళ్లారని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. మాస్క్ పెట్టుకోకుండా ఓ వ్యక్తి మేకను ఎత్తుకెళ్లాలని చూశాడాని, తమను చూసి మేకను అక్కడే వదిలేసి వెళ్లాడని వారు తెలిపారు. అందుకే స్టేషన్ కు తీసుకొచ్చినట్టు ఆ మేక యజమానికి పోలీసులు చెప్పారు. ఎప్పుడూ మాస్క్ లేకుండా తిరగొద్దని వార్నింగ్ ఇచ్చి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version