సంచలనం; 960 మంది వీసాలు రద్దు చేసిన కేంద్రం…!

-

ఢిల్లీ మత ప్రార్ధనల విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్న 960 మంది విదేశీలయుల వీసాలను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. వీసాలతో పాటుగా వారి పాస్‌పోర్టులను సైతం బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది కేంద్ర హోం శాఖ. దీనిపై కీలక ప్రకటన చేసింది. వీరంతా పర్యాటక వీసాలపై వచ్చి నిబంధనలకు వ్యతిరేకంగా,

మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చర్యలు తీసుకుంటున్నట్టు హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సదరు విదేశీయులపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనిపై ఒక ట్వీట్ చేసారు. ట్విట్టర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం ట్వీట్ చేసారు. విపత్తు నిర్వహణ చట్టం-2005, విదేశీయుల చట్టం-1946ను ఉల్లంఘించి ఢిల్లీ నిజాముద్దీన్‌లోని,

తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్నందుకు నిబంధనల ప్రకారం ఆ విదేశీయులపై చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీ కి మత ప్రార్ధనలకు వెళ్ళారు. ఇప్పుడు వారి నుంచి వైరస్ సోకడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version