టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ టూరిజం మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాదూన్‌ లోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ- ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… 72 గ్రూప్‌-సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వేరు వేరు పోస్టులకి వేర్వేరు అర్హతలు వున్నాయి. పదో తరగతి, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఐటీఐ డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

jobs

ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యనే ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 19, 2023. రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 2023 ఫిబ్రవరిలో ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే.. జనరల్ కేటగిరికి చెందిన వారు రూ.1500లు కట్టాల్సి వుంది. అదే ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్థులు అయితే రూ.700లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి.

నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లించడం జరుగుతుంది. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. టెక్నీషియన్ (ఫీల్డ్/ ల్యాబ్ రిసెర్చ్) పోస్టులు 23, టెక్నికల్ అసిస్టెంట్(పారా మెడికల్) పోస్టులు 7, టెక్నీషియన్(మెయింటెనెన్స్) పోస్టులు 6, స్టెనో గ్రేడ్ 2 పోస్టులు 1, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 5, ఫారెస్ట్ గార్డ్ పోస్టులు 2, స్టోర్ కీపర్ పోస్టులు 2, డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ పోస్టులు 4, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 22 వున్నాయి. పూర్తి వివరాలను https://fri.icfre.gov.in/ చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version