రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వల్ల బియ్యానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది – వినోద్ కుమార్

-

సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్. ఈ కార్యక్రమానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సివిల్ సప్లై శాఖ మంత్రి ,కార్పొరేషన్ చైర్మన్ ఇద్దరు కరీంనగర్ కు చెందిన వారేనని అన్నారు.

పేద ప్రజలకు సేవ చేసే అవకాశం ఈ శాఖ ద్వారా దక్కుతుందన్నారు వినోద్ కుమార్. గతంలో సివిల్ సప్లై కార్పొరేషన్ ను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసిన తరువాత రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటను పండిస్తున్నారని తెలిపారు. కోటి టన్నుల వరి ధాన్యం పండిస్తున్నారని.. అంతే స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.

గత సంవత్సరం వరి కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రిని అడిగితే హేళన చేశాడని ఆరోపించారు. మీ తెలంగాణ వాళ్ళు నూకలు తినండి అన్నారని.. కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రతి గింజ కొంటాం అని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వలన బియ్యానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్ ఏర్పడిందన్నారు వినోద్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version