కేంద్రం వార్నింగ్; మనం ఆ దశలోనే ఉన్నాం…!

-

మన దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య మన దేశంలో 1100 గా ఉంది. వీరిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ సహా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తరిస్తుంది. మహారాష్ట్ర, కేరళలో కరోనా ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసులు 200కి చేరుకున్నాయి. కేరళలో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

ప్రతీ గంటకు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీనితో కేంద్రం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు అమలు చేస్తుంది. లాక్ డౌన్ ప్రకటించినా సరే కేసుల సంఖ్య అనేది ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. తాజాగా కరోనా కేసులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గడిచిన 24 గంటల్లో 92 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు కరోనా బాధితులు చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు.

ప్రస్తుతం భారత్ మూడో దశకు చేరుకోలేదని ఆయన వివరించారు. మనం ఇంకా లోకల్ ట్రాన్స్‌మిషన్ (కరోనా బాధితుడిని తాకడం వలన వ్యాపించడం) దశలోనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ (సమూహ వ్యాప్తి)పై వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అలాంటి పరిస్థితులుంటే తామే ప్రకటిస్తామని, ప్రస్తుతానికి కరోనా విషయంలో కమ్యూనిటీ అనే పదాన్నే వాడకూడదని మీడియాకు కూడా కేంద్రం హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version