కేరళ: రాష్ట్రంలో కరోనా విజృంభించింది. దీంతో బుధవారం ఒక్క రోజే 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కలవరం పెరిగింది. దేశం మొత్తం మీద 30 వేల కేసులు నమోదు అయితే ఒక్క కేరళలోనే 20 కేసులు నమోదవడంతో పరిస్థితి భయం.. భయంగా మారింది. కోవిడ్ పరిస్థితులు చేజారినట్లు ఆరోగ్య రంగ నిపుణులు భావిస్తున్నారు. గడచిన 4 వారాల్లోనే వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దీంతో కేంద్రవైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరుగురు సినియర్ వైద్యుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపింది. కరోనా విజృంభణపై వీరు అధ్యయనం చేసి కేంద్రానికి రిపోర్టు ఇవ్వనున్నారు. కరోనా కట్టడి చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
కేరళకు అత్యవసర వైద్య బృందం.. సంపూర్ణ లాక్‌డౌన్
-