జగన్ కి అదిరిపోయే న్యూస్, రాజధానికి కేంద్రం మద్దతు…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు పై కేంద్ర మద్దతు ఉందా…? అంటే అవుననే అంటోంది జాతీయ మీడియా. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని తరలింపు విషయాన్ని ముందే చెప్పారని, వారి ఆశీర్వాదాలతో ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని ఇంగ్లీష్ మీడియా ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్,

దీనికి వారిద్దరి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే వికేంద్రీకరణకు అనుకూలం అని భావించి అసెంబ్లీలో ప్రకటన చేశారని ఆ కథనంలో పేర్కొంది. ఈ విషయం రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూస్తున్న బీజేపీ సీనియర్ నేతలు రాంమాధవ్ జివిఎల్ నరసింహారావు కు ముందే తెలుసని ఆ వార్తలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించింది. అదేవిధంగా రాజధాని తరలింపు పై విషయం గురించి జీవియల్ మాట్లాడిన కొన్ని విషయాలను కూడా ప్రస్తావించింది ఇండియన్ ఎక్స్ప్రెస్.

అసెంబ్లీలో జగన్ 3 రాజధాని విషయం ప్రస్తావించినప్పుడు బిజెపి రాజ్యసభ ఎంపీ మాట్లాడుతూ కేంద్రం పరిధిలోకి రాదని చెప్పారు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించింది. రాజధాని వికేంద్రీకరణ వలన గతంలో జరిగిన పొరపాట్లు జరగవని జగన్ హామీ ఇచ్చిన తర్వాతే కేంద్రం అంగీకరించినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

రాజధాని తరలింపుకి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ ఇప్పటికే తీర్మానం కూడా చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో బీజేపీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అయితే దీనిపై పలువురు రాజకీయ పరిశీలకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మద్దతు ఇచ్చారు కాబట్టే అందుకే రాజధాని ప్రాంతంలో ఎన్ని ఆందోళనలు జరిగినా సరే కేంద్ర పెద్దలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, నిజంగానే అమరావతి మార్పుకి కేంద్రం అంగీకరిస్తే మాత్రం జగన్ ని చంద్రబాబు కాదు కదా ఎవరు ఆపే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version