ఏపీ కి కేంద్ర బృందం.. షెడ్యూల్ విడుద‌ల

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఇటీవ‌ల కాలంలో భారీ వ‌ర్షాలు కురిసిని విష‌యం తెలిసిందే. అయితే భారీ వ‌ర‌దల కార‌ణంగా ఆంధ్ర ప్ర‌దేశ్ తీవ్రం గా న‌ష్ట పోయింది. దీంతో వ‌ర‌ద‌ల కార‌ణంగా న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డానికి కేంద్ర బృందం మూడు రోజుల పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ లోని ప‌లు జిల్లా లో ప‌ర్య‌టించ నుంది. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఈ ఏడుగురు స‌భ్యుల తో కూడిన బృందం ఈ నెల 26 నుంచి 28 వ‌ర‌కు ప‌ర్య‌టించ‌నుంది.

ఈ విష‌యాన్ని విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలియజేసారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అడ్వైజర్ కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలుగా పర్యటించనున్నారు. మొద‌టి రోజు అయిన శుక్ర వారం కేంద్ర బృందం చిత్తూర్ జిల్లా లో ప‌ర్య‌టించి వ‌రద న‌ష్టాన్ని అంచ‌న వేయ‌నుంది. అలాగే శ‌ని వారం చిత్తూరు జిల్లాలో ఒక బృందం , కడప జిల్లాలో మ‌రొక‌ ఒక బృందం పర్యటించనుంది. చివ‌రి గా ఆది వారం నెల్లూరు జిల్లాలో రెండు బృందాలు పర్యటించనున్నాయి. అలాగే సోమ వారం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జ‌గ‌న్ తో స‌మావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version