ఏపీకి కేంద్ర బృందం.. షెడ్యూల్ ఇదే !

-

ముందు ప్రకటించినట్టుగానే ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటనకు రానుంది. వరదలు, వర్షాల వల్ల కలిగిన పంటనష్టం అంచనా వేయనుంది ఈ కేంద్ర బృందం. మొదటి రోజు కృష్ణా జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఇప్పటికే కేంద్ర బృందం విజయవాడ చేరుకోగా ఈ రోజు మధ్యాహ్నం 12.30కి విజయవాడలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంట నష్టం పై కలెక్టర్ వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.

మధ్యాహ్నం 2.30 కి ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడిలో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లనుంది బృందం. ఇక మధ్యాహ్నం 3 గంటలకు కంచికచర్ల మండలం గని ఆత్కూరు, చెవిటికల్లు గ్రామాల్లో పర్యటించనుంది. ఇక అలానే సాయంత్రం 4 గంటలకు చందర్లపాడు మండలంలో పత్తి, మిరప పంటల పరిశీలనకు వెళ్లనున్న కేంద్ర బృందం సాయంత్రం 5.15 కి విజయవాడలో అధికారులతో సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version