బైక్‌లకు ‘శారీ గార్డ్స్‌’ తప్పనిసరి కేంద్రం నిర్ణయం.. లగ్జరీ బైకుల డిజైన్లలో మార్పు??

-

కేంద్ర సర్కార్ మోటారు వాహన నిబంధనలను సవరించింది, అన్ని మోటారుబైక్‌లకు ‘శారీ గార్డ్స్‌’గా పని చేసే… వెనుక చక్రంలో రక్షణ పరికరాలతో పాటు హ్యాండ్‌హోల్డ్‌లు, ఫుట్‌రెస్ట్‌లు ఇక నుంచి తప్పక ఉండాలి. హై-ఎండ్ బైక్‌లపై ప్రయాణించే యువతకు కీలక సూచనలు చేసింది. పిలియన్ రైడర్‌ల బైక్ లకు ఒకటే హ్యాండ్‌హోల్డ్‌ అనుమతించరు. ఈ భద్రతా లక్షణాలు లేని లగ్జరీ బైకుల డిజైన్లలో మార్పులకు మార్పులు అవసరమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

సోమవారం, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటారు వాహనాల (ఏడవ సవరణ) నిబంధనలు 2020 కి సంబంధించి తెలియజేసింది. తదనుగుణంగా సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలను సవరించే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం, ద్విచక్ర వాహనాల తయారీదారులు… మోటారు బైక్ చక్రం వైపు లేదా డ్రైవర్ సీటు వెనుక హ్యాండ్‌హోల్డ్స్‌ను తప్పక ఉండేలా చూడాలని పేర్కొంది.

వాహనం యొక్క రెండు వైపులా పిలియన్ రైడర్‌లకు ఫుట్‌రెస్ట్‌లను అందించడంతో పాటు, పిలియన్‌పై కూర్చున్న వ్యక్తి బట్టలు చిక్కుకుపోకుండా ఉండటానికి తయారీదారులు వెనుక చక్రంలో సగం కప్పే రక్షణ పరికరాలను అందించాలనీ స్పష్టం చేసింది. 2000 ప్రారంభం నుండి ఈ భద్రతా లక్షణాలను సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలలో పొందుపరిచినప్పటికీ, వాహన తయారీదారులు చాలా సంవత్సరాలుగా భద్రత నిబంధనలు లేకుండా హై ఎండ్ వాహనాలను ఉత్పత్తి చేశారని ఆరోపణలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version