ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో నలుగురు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు ఉన్నారు. 42 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ పట్టభద్రుల స్థానంలో బిఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదనేది చర్చనీయాంశంగా మారింది అని చాడ వెంకటరెడ్డి అన్నారు. బిజెపితో లోపాయి కార, చీకటి ఒప్పందం పెట్టుకోని బిఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టలేదు. కేసిఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ బలమైన నాయకులు ఉన్న ఉమ్మడి కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానంలో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదో పట్టభద్రులు, మేధావులు చర్చించాలి.
తెలంగాణకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకుండా అన్యాయం చేస్తోంది. బిజెపి పాలిత రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో అడ్డగోలుగా నిధులు ఇస్తూ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణకు నిధులు ఇవ్వని దుస్థితి నెలకొంది. తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎంపీలు ఉన్న కేంద్ర బడ్జెట్ లో నిధులు తీసుకువచ్చింది శూన్యం. అందుకే పట్టభద్రులు, మేధావులు బిజెపికి చెక్ పెట్టాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. బీసీ కులగనణ, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత నిర్ణయాలు సాహోసోపేతమైనవి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పట్టభద్రులు గెలిపించాలి అని చాడ వెంకటరెడ్డి తెలిపారు.