మాజీ భార్య గురించి నాగచైతన్య ఏమన్నాడంటే !

-

టాలీవుడ్ హీరో మరియు సమంతలు భార్యాభర్తలుగా విడిపోయిన తర్వాత ఎవరు జీవితంలో వారు బిజీ అయిపోయారు. కాగా తాజాగా నాగచైతన్య చాలా కాలం తర్వాత తన మాజీ భార్య సమంత గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చైతన్య మాట్లాడుతూ సమంత మంచి మనసున్న వ్యక్తి .. ఈమెకు జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలని కామెంట్ చేశాడు. మేము దూరం కావడానికి కొన్ని వదంతులు కీలకంగా మారాయని చెప్పాడు. అయితే సమాజం మమ్మల్ని వేరే విధంగా అర్ధం చేసుకుపోవడం చాలా బాధ కలిగింది.

మాకు ఎప్పుడూ ఒకరిపై ఒకరు గౌరవం గానే ఉన్నాము అంటూ కొంచెం బాధపడినట్లు చెప్పాడు. ఇప్పుడు ఇద్దరం మా మా జీవితాల్లో చాలా సంతోషంగా ఉన్నాము. కాబట్టి ఎవరూ మమ్మల్ని బాధపెట్టే వ్యాఖ్యలు చేయకండి అంటూ కోరుకున్నాడు. ఇక తాజాగా నాగచైతన్య సినిమా “కస్టడీ” నుండి ఇవాళే ట్రైలర్ రిలీజ్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version